సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏకంగా 20 లక్షల రూపాయలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు పీఎం ముద్రా యోజన స్కీమ్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ స్కీమ్ లో భాగంగా 10 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే ఛాన్స్ అయితే ఉంది.

ఇప్పటివరకు లిమిట్ 10 లక్షల రూపాయలే కాగా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం లోన్ లిమిట్ ను రెట్టింపు చేసింది. 20 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నట్టు మోదీ సర్కార్ ప్రకటించింది. 2015 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. కార్పొరేట్ అవసరాల కోసం వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ పథకం కింద మూడు రకాల లోన్లు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శిశు లోన్ కింద 50,000 రూపాయల వరకు లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కిషోర్ విభాగం కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్‌ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తరుణ్ లోన్‌ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్‌ పొందవచ్చు. కేంద్రం బడ్జెట్ లో ఇచ్చే మొత్తాన్ని పెంచడంతో ఇకపై ఎక్కువ మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

బ్యాంక్ బిజినెస్ ప్లాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్‌, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్‌ ను సబ్మిట్ చేసి ముద్రా స్కీమ్ కింద లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మన దేశానికి చెందిన పౌరులు మాత్రమే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 18 సంవత్సరాల ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.