నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో 425 ఉద్యోగ ఖాళీలు!

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 425 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 425 డిప్లొమా ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 2023 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 344 ఉండగా డిప్లొమా ట్రైనీ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 68 ఉన్నాయి. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు మాత్రం 13 ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు మన దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. వరుసగా జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.