ఓఎన్జీసీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అంటూ?

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓఎన్‌జీసీ సెక్టార్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 2, 236 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఎగ్జీక్యూటీవ్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 7000 రూపాయల నుంచి 9000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://ongcindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.

ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల కాగా అర్హత ఉన్నవాళ్లు ఆ కలను సులువుగానే నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు సులువుగానే ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.