ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు పొందే ఛాన్స్!

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరల వల్ల ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఈ నెల 11వ తేదీ నుంచి బియ్యం కందిపప్పు సబ్సిడీ ధరలకే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది.

బహిరంగ మార్కెట్ లోని ధరలతో పోల్చి చూస్తే తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసే అవకాశం అంటే శుభవార్త అనే చెప్పాలి. మంత్రి నాదెండ్ల మనోహార్ మాట్లాడుతూ 181 రూపాయల కందిపప్పును 160 రూపాయలకు 52 రూపాయాల బియ్యాన్ని 48 రూపాయలకు 56 రూపాయల స్టీమ్డ్ రైస్ ను 49 రూపాయలకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించడం గమనార్హం.

సమీపంలోని రైతు బజార్లకు వెళ్లడం ద్వారా వీటిని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరింత ఎక్కువ మొత్తం తగ్గింపును అమలు చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే సమీపంలో రైతుబజార్లు లేని వాళ్లకు మాత్రం ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ధరల తగ్గింపు దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేసింది.

రేషన్ వాహనాల ద్వారా సబ్సిడీ ధరలకే కందిపప్పును రైతులకు అందిస్తే ప్రజలకు మరింత బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. మరి ఏపీ సర్కార్ ఈ దిశగా కచ్చితంగా అడుగులు వేస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.