తమిళనాడు రాష్ట్రంలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 588 గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నీషియల్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 28వ తేదీలోగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 23వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 336 ఉండగా టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 252 ఉన్నాయి. వేర్వేరు ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీటెక్, టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులు కాగా టెక్నీషియన్ ఉద్యోగాలకు బీటెక్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలని తెలుస్తోంది.
నర్సింగ్ ఉద్యోగాలకు మాత్రం డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లు అర్హత కలిగి ఉంటారని భోగట్టా. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,524 రూపాయల నుంచి 15028 రూపాయల వరకు వేతనం లభించనుంది. డిప్లొమా, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది.