నేషనల్ డిఫెన్స్ అకాడమీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.63 వేల వేతనంతో?

నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. పది, ఇంటర్ అర్హతతో గ్రూప్ సి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్డీఏ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

nda.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉండగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్‌కు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు.

మొత్తం 198 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఆన్ లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. nda.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకురుతుంది.