మోదీ సర్కార్ సూపర్ స్కీమ్.. భార్యాభర్తలు ఏకంగా 41,000 పొందే అవకాశం?

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. 2004 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్ కు వడ్డీ రేటు పెరగనుందని తెలుస్తోంది. . సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వృద్ధుల కోసం స్పెషల్ గా అమలు చేస్తోంది.

60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే డబ్బుల్ని దాచుకొని వడ్డీ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీన నుంచి ఈ స్కీమ్ అమలవుతుండగా 8.2 శాతం వడ్డీ అమలవుతోంది.

ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై సంవత్సరానికి దాదాపుగా 2.5 లక్షల రూపాయల వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. నెలకు 20,000 కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉంటే రెట్టింపు మొత్తం పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.