ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండగా జగన్ సర్కార్ వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగులకు మరింత మేలు చేస్తుండటం గమనార్హం. విశాఖపట్నంలో మెగా జాబ్ మేళా దిశగా అడుగులు పడుతుండగా ఈ జాబ్ మేళా ద్వారా 4,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని తెలుస్తోంది.
డిసెంబర్ నెల 2వ తేదీన ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ప్రముఖ రాజకీయ నేత, మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. జేడీ ఫౌండేషన్ తరపున సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతీయువకులకు ఈ జాబ్ మేళా ద్వారా ప్రయోజనం చేకూరనుంది. భవిష్యత్తులో కూడా జాబ్ మేళాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ప్రముఖ కంపెనీలు హాజరవుతున్న నేపథ్యంలో విద్యార్థులు సైతం ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ జాబ్ మేళాలో పాల్గొంటే మంచిదని చెప్పవచ్చు. రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఫార్మల్ డ్రెస్ లో ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. విశాఖలోని నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
యువతలో ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్నారు. ఆ కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లు ఈ జాబ్ మేళాపై పై దృష్టి పెడితే బెటర్ అని చెప్పవచ్చు. ఈ జాబ్ మేళాలో కొన్ని కంపెనీలు ఏడాదికి 3 లక్షలకు పైగా వేతనాన్ని ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.