నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.3 వేలు పొందే అవకాశం.. ఎలా పొందాలంటే?

కర్ణాటక రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అయితే ఇచ్చిన హామీలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం కోసం కొన్ని నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుండటం గమనార్హం. యువనిధి పేరుతో నిరుద్యోగులకు కర్ణాటక సర్కార్ రూ.3 వేలు అందిస్తోంది.

2022 – 2023 సంవత్సరంలో డిగ్రీ, డిప్లొమా పాసైన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. డిగ్రీ పాసైన వాళ్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున డిప్లొమా పాసైన వాళ్లకు నెలకు 1500 రూపాయల చొప్పున కర్ణాటక ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అందిస్తుండటం గమనార్హం. 24 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఈ మొత్తాన్ని అందించనుందని సమాచారం అందుతోంది.

డిగ్రీ, డిప్లొమా పాసైన వాళ్లకు ఆరు నెలలకు ఉద్యోగం రాకపోతే గరిష్టంగా రెండేళ్ల వరకు ఈ మొత్తాన్ని అందించడం జరుగుతుందని తెలుస్తోంది. కన్నడిగులు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఉద్యోగం వచ్చిన వాళ్లకు ఈ పథకం ప్రయోజనాలు ఆగిపోతాయని సమాచారం అందుతోంది. సేవా సింధు పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందలేరు. తప్పుడు సమాచారం ఇచ్చి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందితే మాత్రం జరిమానా విధిస్తారని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సేవా సింధు పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.