పదో తరగతి అర్హతతో ఇస్రోలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.70 వేల వేతనంతో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ టెక్నీషియన్-బి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 31 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 54 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలలో టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) ఉద్యోగ ఖాళీలు 33 ఉండగా టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రూమెంట్ మెకానిక్) ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్) ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. కనీసం పదో తరగతి పాసైన వాళ్లు టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎన్‌టీసీ లేదా ఎన్‌ఏసీ పూర్తిచేసి పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ నుంచి అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు సైతం కనీసం పదో తరగతి పాసై ఉండటంతో పాటు ఫోటోగ్రఫీలో అర్హత కలిగి ఉండాలి. https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 70 వేల రూపాయల వేతనం లభిస్తుంది.