ప్రస్తుత కాలంలో జీవన శైలిలో మార్పులు రావటం వల్ల అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలా ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. చర్మ సంబంధిత సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే ముసలి వాళ్ళు లాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది అతి చిన్న వయసులోనే చర్మం మీద ముడతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే ముడతల సమస్య రావటానికి కొంతమందికి జన్యుపరమైన కారణాలు ఉంటే మరి కొంతమంది కి ఉన్న కొన్ని చెడు అలవాట్లు వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. చర్మం మీద ముడతలు ఏర్పడటానికి కారణమైన ఆ చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా కొంతమందికి జీన్స్ వల్ల అతి చిన్న వయసులోనే చర్మం మీద ముడతలు ఏర్పడుతూ ఉంటాయి.అలాంటి సమయంలో మనం ఏం చేయలేము. కానీ మనకి ఉండే కొన్ని అలవాట్లు వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. ఈ సమస్యకు కారణమైన చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
• ధూమపానం మరియు మద్యపానం : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ధూమపానం మద్యపానానికి బాగా అలవాటు పడ్డారు. అయితే ఎక్కువగా ధూమపానం మద్యపానం చేయటం వల్ల వాటి ప్రభావం శరీరం లోపలి భాగాల మీద మాత్రమే కాకుండా చర్మం మీద కూడా పడుతుంది. అధిక మోతాదులో ధూమపానం మద్యపానం చేయటం వల్ల చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
• మేకప్ : ప్రస్తుత కాలంలో యువతులు ఎక్కడికి వెళ్ళినా మేకప్ లేనిదే బయటికి వెళ్లారు. అయితే ఇలా నాణ్యతలేని మేకప్ వస్తువులను వాడటం లేదా ఎక్కువ సమయం మేకప్ శుభ్రం చేసుకోకుండా ఉండటం వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది.
• ఆహార పద్ధతులు : సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా చిన్న వయసులోనే ఇలా చర్మం మీద ముడతలు ఏర్పడతాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర వంటి వాటికి దూరంగా ఉండాలి.
• సూర్య రష్మి : సూర్య రష్మి శరీరానికి చాలా అవసరం. కానీ ఎక్కువ సమయం ఎండలో ఉండటం వల్ల చర్మం మీద ముడతలు ఏర్పడతాయి.