మీ లైఫ్ పార్టనర్ తో గొడవలు రాకూడదంటే ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు?

సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య ఏదో ఒక విషయం గురించి చిన్నపాటి మనస్పర్ధలు గొడవలు తలెత్తడం సర్వసాధారణం.ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుని పోతే వారి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా మారి చివరికి విడాకుల వరకు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే మీ లైఫ్ పార్ట్నర్ తో కనుక గొడవలు ఉన్న లేదా గొడవలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

మీ జీవిత భాగస్వామి ప్రతికూలతతో మీకు సంబంధం లేదు కనుక వారి వద్ద మీరు వాస్తవాలనే చెప్పండి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఇక భార్య భర్తల మధ్య కొన్ని విషయాల పట్ల మనస్పర్థలు తలెత్తితే ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడటం ఎంతో మంచిది. ఒకవేళ మీరు కనుక పాజిటివ్ స్వభావంతో ఉంటే ప్రతిరోజు మీ జీవిత భాగస్వామి వద్ద సానుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక విషయంలో మీ లైఫ్ పార్టనర్ ప్రతికూలంగా ఉన్నట్లయితే వారి దృష్టిని మళ్ళించండి.

ఇక మీ జీవిత భాగస్వామి ఏ విషయంలోనైనా మొండిపట్టుతో ఉన్నప్పుడు మీరు ఆ విషయాన్ని చూసి చూడనట్లు వెళ్లిపోవాలి కానీ మీరు కూడా మొండి పట్టుగానే ఉంటే మీ బంధం అక్కడితో ముగుస్తుందని అర్థం.ఒకవేళ మీ జీవిత భాగస్వామి దేని గురించైనా ఆలోచిస్తూ ఉన్నారంటే ముందు ఆ సమస్యను పరిష్కరించి తనను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అయినా వ్యాపారాలకు ఉద్యోగాలకు సంబంధించిన విషయాలైనా చెప్పాల్సినవి అవసరమైనవి మాత్రమే మీ జీవిత భాగస్వామితో షేర్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడపవచ్చు.