నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీపికబురు.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 490 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మరో 7 రోజులలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియనుందని సమాచారం అందుతోంది. పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలలో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 150 ఉండగా టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 230 ఉన్నాయని సమాచారం అందుతోంది. ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాలకు డిప్లొమా అర్హతగా ఉంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలకు మాత్రం ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది. 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.iocl.com/apprenticeships వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.