సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను ఏదో ఒక సమయంలో ప్రేమ చిగురించడం సర్వసాధారణం ఇలా ప్రేమలో ఉన్నవారు తమ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఊహించుకుంటూ ఉంటారు అయితే కొందరుప్రేమ ప్రయాణం వారు ఊహించిన విధంగా ఉండగా మరికొందరు మధ్యలోనే వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు.ఇక మరికొందరైతే ప్రేమించినంత కాలం మంచిగా నటిస్తూ పెళ్లి తర్వాత వారిలో ఉన్నటువంటి సైకోనీ బయటపెడుతూ ఉంటారు. అయితే ప్రేమలో ఉన్న సమయంలోనే మీరు ప్రేమించిన వారు ఇలా కనుక వ్యవహరిస్తూ ఉంటే తప్పకుండా వారు సైకో అని అలాంటి వారి నుంచి అప్పుడే బయటపడటం ఎంతో మంచిదనీ చెప్పాలి.
మీరు ప్రేమించిన వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని వారి గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా ఎమోషనల్ గా నటిస్తూ ఉంటారు.జాలి కలిగే కథలు చెప్పడం ఏదైనా ఇతరుల పట్ల ఒక సంఘటన జరిగితే తొందరగా రియాక్ట్ అవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఇతరులను అతిగా పొగుడుతూ ఉంటారు ఇలా అతిగా పొగిడే వారి నుంచి వెంటనే దూరం కావడం ఎంతో మంచిది.
ఇక సైకో లక్షణాలు కలిగినటువంటి వారు ప్రేమలో ఉన్నప్పుడు చిన్న విషయానికే బ్రేకప్ చెప్పుకుంటారు. తర్వాత తిరిగి మనతో మాట్లాడటానికి ప్రయత్నించి మనతో మంచిగా ఉంటారు తిరిగి మరి బ్రేకప్ చెబుతూ ఉంటారు ఇలా తరచూ బ్రేకప్ చెప్పేవారు సైకో లక్షణాన్ని కలిగి ఉంటారని గుర్తించాలి ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. ఇద్దరు వ్యక్తులు నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య మూడో వ్యక్తి రావడానికి ఇష్టపడరు కానీ సైకో లక్షణాలు ఉన్నటువంటి వారు వారి మధ్య మూడో వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు.వాళ్ల దగ్గర మనల్ని చీప్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు కనుక మీరు ప్రేమించే వారిలో ఉంటే వెంటనే వారి నుంచి దూరం కావడం ఎంతో మంచిది.