సాధారణంగా చాలామంది భార్యలు తమ భర్త తాము చెప్పినట్టే వినాలని కోరుకుంటారు. అదేవిధంగా తాము ఎక్కడ ఉంటే తన భర్త కూడా అక్కడే ఉండాలని తనతో చాలా రొమాంటిక్గా ఉండాలని భావిస్తూ ఉంటారు ఇలా భర్త భార్య కొంగు పట్టుకుని తిరగాలంటే భార్యలు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు…భర్త ఎప్పుడు మీతో చాలా ప్రేమగా ఉంటూ మీ వెంటే ఉండాలి అంటే మీరు మీ భర్త విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మీ భర్తకు ఏదైతే నచ్చుతుందో ఆ విషయంలో తనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒకరితో ఒకరు పంచుకోవడం ఎంతో ముఖ్యం.వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వింటే వారి మనసు అర్థం చేసుకోవడం సులభమవుతుంది.భర్తతో గడిపేందుకు సమయాన్ని కేటాయించండి.ఇక మీ భర్తతో కలిసి అలా తరచూ బయటకు వెళ్లడం డిన్నర్ డేట్ కు వెళ్లడం అంటే చేయడం వల్ల మీ భర్తకు మీపై ప్రేమ కలిగి మీకు ప్రాధాన్యత ఇస్తారు.
ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి శారీరక భాష ద్వారా ప్రేమను వ్యక్తం చేయాలి. వారితో కనెక్ట్ అయ్యేందుకు సహాయపడతాయి. ఇక మీ జీవిత భాగస్వామిలకు చిన్న చిన్న సర్ప్రైజులు కూడా ప్లాన్ చేస్తూ ఉండాలి.మీరు మీ గురించి మంచిగా భావించినప్పుడు, అది మీ వైఖరి, ప్రవర్తనలో చూపిస్తుంది. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీలైనంతవరకు మీ భర్తతో ప్రేమగా ఉంటూ అతనితో శారీరకంగా మానసికంగా తనకు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీ భర్త మీ వెంట ఉంటూ మీకు సపోర్ట్ చేస్తారు.