మీపై మీ లైఫ్ పార్టనర్ కు నమ్మకం ఉందా లేదా అనే సందేహం కలుగుతుందా అయితే ఇలా చెక్ చేయండి!

ప్రస్తుత కాలంలో ఏ రిలేషన్షిప్ అయినా ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ఇద్దరు మధ్య ప్రేమ మాత్రమే ముఖ్యం కాదు ఇద్దరి మధ్య నమ్మకం అనేది కూడా ఎంతో ముఖ్యం ఇలా ఇద్దరి మధ్య నమ్మకం ఉన్నప్పుడే మీ బంధంలో ఎక్కువ రోజులు సంతోషంగా ఉండటానికి కారణమవుతుంది. లేదంటే ఆ బంధం కొన్ని రోజులకే విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది. మీరు పార్టనర్ మిమ్మల్ని నిజంగా నమ్ముతున్నారా , మీ పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఇలా చెక్ చేయండి.

మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయితే ఎక్కడికి వెళ్లావు ఇంతసేపు ఏం చేసావ్ కనీసం ఫోన్ చేసి అయినా లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా అని తరచూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీపై నమ్మకం లేనట్టే. అలాగే కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటారు. ఒకవేళ మీరు ఏదో పనిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే తప్పనిసరిగా ఈ విషయం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీపై నమ్మకం లేదని అర్థం.

ఇక మీపై నమ్మకం లేనటువంటి మీ లైఫ్ పార్టనర్ తరచూ మీ సెల్ ఫోన్ టెక్స్ట్ మెసేజ్లను వాట్సాప్ ఇతరత మీ వ్యక్తిగత విషయాలను చెక్ చేస్తున్నారు అంటే మీపై వారికి నమ్మకం లేదని అర్థం. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరదాగా మీరు మీ స్నేహితులతో సమయం గడపాలనుకున్నప్పుడు మీ భాగస్వామి మీతో ఉండాలని పట్టుబట్టినట్లయితే, వారు మిమ్మల్ని నమ్మడం లేదని భావించాల్సిందే. వారు మీతో లేనప్పుడు మీరేం చేస్తున్నారో అనే ప్రశ్నలు వారిని సక్రమంగా ఉండనివ్వవు. ఇలా కనుక మీ పార్ట్నర్ మీతో ప్రవర్తిస్తూ ఉంటే వారికి మీపై నమ్మకం లేదని అర్థం.