సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడటం సర్వసాధారణం ఇలా చాలామంది ఇతరులను ఇష్టపడి చివరికి వారిని పెళ్లి చేసుకొని జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతుంటారు.అయితే ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారనే విషయాన్ని మనం కొన్ని లక్షణాలు ఆధారంగా గుర్తుపట్టవచ్చు. ఒక వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారని తెలిసిపోతుంది. మరి మనం అంటే ఇష్టం ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం…
ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎక్కువగా మీరు ఉన్నచోట ఉండటానికే ఇష్టపడుతుంటారు.అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మీరు వెళ్లే చోటికి రావడం లేదా మీరు ఉంటున్న చోటే ఉండడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక పదేపదే మీరు పనిలో నిమగ్నమైన మిమ్మల్ని చూస్తూ ఉండటం,మీరు వారి వైపు చూసినప్పుడు తల పక్కకు తిప్పుకోవడం వంటి లక్షణాలు ఒక వ్యక్తిలో కనపడుతున్నాయి అంటే అతను తప్పనిసరిగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం.
ఇక ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే తనని మీరు చూడగానే పెదాలపై చిన్న చిరునవ్వు వస్తుంది. అదేవిధంగా అవసరం ఉన్న లేకున్నా మిమ్మల్ని తాకాలని ప్రయత్నం చేస్తుంటారు.ఇక అమ్మాయిలైతే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నప్పుడు వారిని చూసే సమయంలో ముందుగా జుట్టుని వారి దుస్తులను సరిచేసుకుంటూ కనపడతారు. ఇలా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇతరులు ఆ వ్యక్తి ముందు ఎంతో అందంగా ముస్తాబయి తిరుగుతూ ఉన్నారంటే తప్పనిసరిగా ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టమని అర్థం.