ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. భవిష్యత్తులో అత్యవసర సమయాలలో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ప్రతినెల వచ్చే జీతం లో కొంత మొత్తం పిఎఫ్ అకౌంట్ లో పొదుపు చేస్తారు. పీఎఫ్ ఖాతాలలో జమ చేసిన డబ్బు విత్ డ్రా చేయటానికి ప్రభుత్వం కొత్త విత్‌డ్రా రూల్స్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు మీరు పీఎఫ్ డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు అనే దానిపై అనేక పరిస్థితులు పరిగణలోకి తీసుకోవచ్చని గుర్తించుకోవాలి. విత్ డ్రా పరిమితి వివిధ పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది. అందువల్ల పీఎఫ్ అకౌంట్ నుండి ఏ సమయంలో ఎంత మొత్తం డబ్బు విత్ డ్రా చేయవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ ఖాతా 10 సంవత్సరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గృహ రుణాల చెల్లింపు కోసం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90% వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే పిల్లల చదువు కోసం 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పిఎఫ్ అకౌంట్ నుండి 50% వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక చందాదారుల మొత్తం సేవా వ్యవధిలో మూడు సార్లు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని గమనించాలి. ఇక పిల్లల వివాహం కోసం 7 ఏళ్ల తర్వాత 50 శాతం వరకు విత్‌డ్రా చేయటానికి అనుమతి ఉంటుంది.
అలాగే పదవీ కోల్పోతే పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఒకేసారి డబ్బులు అందవు. ఒక వ్యక్తి ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉంటే అతను పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అతను రెండు నెలలు నిరుద్యోగిగా ఉంటే అతను మిగిలిన 25% కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వ్యక్తి ఉద్యోగం చేసి ఆరు నెలల కంటే తక్కువ ఉంటే అప్పుడు, పీఎఫ్ డబ్బును మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి పెన్షన్ ఖాతాలో జమ చేసిన మొత్తం తిరిగి విత్‌డ్రా చేసుకోలేరని గమనించాలి. అలాగే పదవీ విరమణకు రెండేళ్ల ముందు 90 శాతం మొత్తాన్ని పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.