నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో తిరుపతి ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు!

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో ప్రైవేట్ ఉద్యోగం దొరకడం కూడా కష్టమవుతోంది. ఐఐటీ తిరుపతి తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ అసోసియేట్ మెకానికల్ ఉద్యోగ ఖాళీతో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్ ఉద్యోగ ఖాళీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. పీఏ పోస్ట్ కు ఎంపికైన వాళ్లకు 22,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు వేతనం లభించనుండగా పీవో ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 30,000 రూపాయల నుంచి 40000 రూపాయల వరకు వేతనం లభించనుంది. https://iittp.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

outsourcingrect@iittp.ac.in ఈ మెయిల్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు స్పోర్ట్స్ కోచ్, జిమ్ ట్రైనర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.