భార్యాభర్తల వైవాహిక జీవితంలో శృంగారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. శృంగారం ద్వారా ఒకరి పై ఒకరికి మరింత ప్రేమ అన్యోన్యత కలుగుతాయని అనేది మందిరిలేషన్ షిప్ నిపుణులు ఇప్పటికే చెప్పారు. శృంగార జీవితం బాగుంటేనే రోజువారీ జీవితం కూడా బాగుంటుందని, అది బాగా లేకకపోతే అంత ఉత్సాహంగా ఉండలేరన్న విషయం అనేక సర్వేల ద్వారా నిరూపితమైంది కూడాఅయితే కొన్న కొన్ని పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవడం మరికొన్నింటిని దూరం చేసుకోవడం ద్వారా మరింత ఆనందమయమైన జీవితాన్ని పొందవచ్చు. మనం తినే ఆహారం శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొంత మంది కొన్ని రకాల ఫ్లేవర్స్‌తో కూడిన ఆహార పదార్ధాలను ఇష్టపడతారు. ఆ ఇష్టపడే ఆహారాన్ని బట్టి ఆ వ్యక్తులు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటారో చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు. మరి అవేమిటో తెలుసుకుందాం.
వెరైటీ పిజ్జాలు ఇష్టపడేవారు
పిజ్జా తినడం ఇవాళ రేపు కామన్ అయిపోయింది. లవర్స్ అయినా, భార్యా భర్తలైనా వీకెండ్ వస్తే చాలు కాలక్షేపం కోసం కబుర్లాడుకోవడానికి పిజ్జాహట్స్‌లోకి దూరిపోతారు. పిజ్జాలో ఎన్నో రకాల వైరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఒకొక్కరూ ఒక్కోరకం వెరైటీనీ ఇష్టపడతారు. అయితే మీరు ఇష్టపడే పిజ్జాని బట్టి మీ భాగస్వామితో ఎలా ఉండాలనుకుంటారో చెప్పేయవచ్చు. మరి మీరు ఇష్టపడే పిజ్జా మీ వ్యక్తిత్వాన్ని ఎలా డిసైడ్ చేయబడుతుంది. తెలుసుకుందాం..
పెప్పరోనిః పెప్పరోని అనేది పిజ్జాలో ఒక టైప్. ఈ రకం పిజ్జాని ఇష్టపడేవారు లేజీ లవర్స్‌గా ఉంటారు. ఏ పనైనా సరే ఆలస్యంగా చేస్తుంటారు. అలాగే ఏ పనైనా సరే ముందు భాగస్వామే మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటారు. తాము ముందుగా కమిట్ అవ్వరు. భాగస్వామికి సరెండర్ అవడం అంటే వీరికి ఇష్టం.
మార్గరెటాః ఇక ఈ పిజ్జా తినేవారు ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకుంటారు. కొత్తగా లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడం వీరికి అసలు రాదు.
మీట్ ఫీస్ట్ః మీట్‌ఫీస్ట్‌ను ఇష్టపడేవారు మార్గరెటా తినేవారికి భిన్నంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ కొత్తధనం కావాలి. అలాగే సమయం దొరికితే చాలు భాగస్వామితో కలిసి ఉండాలని అనుకుంటారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లడం, హాలీడేస్‌ను భాగస్వామితో ఎంజాయ్ చేయడం వీరికి చాలా ఇష్టం.
హావేయన్ః హావేయన్ రకం పిజ్జాని ఇష్టపడేవారు చేసే పని ఎప్పుడూ కొత్తగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎక్స్‌పెరమెంట్స్ చేస్తుంటారు. భాగస్వామితో కలిసి కొత్త కొత్త ప్రకృతి ప్రదేశాలలో శృంగారం చేయడం వీరికి ఇష్టం.
వెజ్జీః వెజ్జీరకాలని ఇష్టపడేవారు సున్నిత మనస్కులై ఉంటారు. వీరు బెడ్‌రూంలో తన భాగస్వామిని ఏమాత్రం కష్టపెట్టకుండా ఉండాలని కోరుకుంటారు. విషయం ఎలాంటిదైనా సరే స్మూత్‌గా డీల్ చేయాలని అనుకుంటారు. భాగస్వామితో గొడవలు పెట్టుకోవడం వీరికి అసలు నచ్చదు.
మష్య్రూమ్ పిజ్జాః ఈ రకం పిజ్జాని ఇష్టపడేవారు కొత్తగా ఏదైనా చేయాలని చూస్తుంటారు. కానీ ఎప్పుడూ పాత సిద్ధాంతాన్నే అనుకరిస్తారట.
వెరైటీ `టీ`లు ఇష్టపడేవారు
డల్‌గా ఉన్నప్పుడు ఉత్సాహాన్ని నింపే పానీయం తేనీరు. రోజూ ఉదయం లేవగానే ఓ కప్పు టీ కడుపులో పడితేకానీ రోజు మొదలవని వారు చాలా మందే ఉన్నారు. రోజుకు రెండుకప్పుల ఛాయ్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది పరిశోధకులు కూడా చెప్పారు. అలాంటి ఛాయ్‌లో కూడా ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కేవలం పిజ్జాని తినేవాళ్లని బట్టేకాదు, టీతాగే రకాన్ని బట్టి కూడా వాళ్ల రొమాంటిక్ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చట. మరి అదేంట తెలుసుకుందాం.
లూస్‌లీఫ్ః లూస్‌లీఫ్ రకం తేనీరును ఇష్టపడేవారు శృంగార జీవితం పై ఎక్కువ మక్కువతో ఉంటారు. వీరికి చాలా మంది గర్లఫ్రెండ్స్ఉంటారట. అమ్మాయిలతో మాట్లాడడం అంటే వీరికి చాలా సరదా.
గ్రీన్ టీః గ్రీన్ టీని ఇష్టపడేవారు ఎప్పుడూ తమ శృంగార జీవితం పట్ల ఆందోళనగా ఉంటారట. ఎప్పుడూ ఇతరుల జీవితం ఎలా ఉంది అనేదాని పైనే ఆలోచిస్తారట. వీరు కొన్ని విషయాలలో జలస్‌గా కూడా ఫీలవుతారు అయితే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవడం వీరికి నచ్చదు. వారికి ఏ విషయమైతే నచ్చుతుందో ఆ రకంగా రొమాన్స్ చేయడానికే వీరు ఇష్టపడతారు.
స్ట్రాంగ్ః స్ట్రాంగ్ టీని ఇష్టపడేవారు తమ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని అనందంగా అనుభవిస్తారట. వీరికి భాగస్వామిని ఎత్తుకోవడం, హత్తుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడూ భాగస్వామిని హగ్ చేసుకుని ఉండాలని వీరు కోరుకుంటారు.
ఫ్రూటీః వీరి శృంగార జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతిదీ నూతనంగా ఉండాలని కోరుకుంటారు. భాగస్వామితో కలిసి తిరగం అంటే వీరికి సరదా.
ఈ పండ్లతో…
శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని రకాల కూరగాయలు, పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అలాంటా వాటిలో ముఖ్యంగా ఐదు రకాల పండ్లను మన నిత్య జీవితంలో రోజూ తినడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చట. మరి ఆ పండ్లేంటో మీరు తెలుసుకుని వీలైనన్ని ఎక్కువ పండ్లను తినడానికి ప్రయత్నించండి.
నేరేడు పండుః ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ పండు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్న విటమిన్లు ఇంకా ప్రొటీన్‌లు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. క్రోమియం, ఫైబర్‌లు ఎక్కువగా ఉండే నేరేడు పండు శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండును ప్రతి రోజు సాయంత్రం సమయంలో తినడం వల్ల రాత్రి శృంగారంలో రెచ్చిపోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయః వేసవిలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించే పుచ్చకాయలో ఔషధగుణాలు ఉంటాయి. శరీరానికి చలువ చేస్తుందని ఎక్కువమంది దీన్ని తింటారు. కొలెస్ట్రాల్ ఉండదు. కొవ్వు శాతం కూడా తక్కువ కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న ఆందోళన కూడా అక్కర్లేదు. కానీ దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెంచే గుణం ఈ పుచ్చకాయలో ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోధనల ద్వారా వెల్లడైంది.
జామపండుః జామపండును తినడం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. జామపండులో ఉండే కొన్నిప్రొటీన్‌లు పురుషుడి శరీరంలోని శృంగార హార్మోన్‌లను ప్రేరేపితం చేస్తాయి అందుకే జామపండు శృంగార సామర్థ్యం పెంచడానికి దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు.
మామిడిపండుః పండ్లలో రారాజుమామిడిపండును తగిన మోతాదులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడిపండ్లతో రక్త ప్రసరణ వేగం పెరిగి, శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ః ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా ఆపిల్‌ను తినవచ్చు రోజూ ఆపిల్‌ను తినడం వల్ల శృంగార సామర్య్థం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.