గెయిల్ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గెయిల్ అధికారిక పోర్టల్ ను విజిట్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 9 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నాయి. సీనియర్ సూపరిండెంట్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ సూపరిటెండెంట్(హెచ్‌ఆర్), సీనియర్ కెమిస్ట్, ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్), ఫోర్‌మెన్ (ఇన్‌స్ట్రూమెంటేషన్), ఫోర్‌మెన్ (మెకానికల్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

సీనియర్ సూపరింటెండెంట్ (హిందీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హిందీ లిటరేచర్‌లో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌ నుంచి హిందీలోకి ట్రాన్స్‌లేషన్ చేసే విషయంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

కెమిస్ట్రీలో రెండేళ్ల పీజీ కోర్సు చేసి 50 శాతం మార్కులు ఉన్నవాళ్ళు సీనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు కనీసం 8 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా ఉండాలి. ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్‌లో డిప్లొమా చేసి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. మెకానికల్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఫోర్‌మెన్ (మెకానిక్) ఉద్యోగాలకు అర్హులు.

www.gailonline.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ నాన్ – ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై నౌ ఆప్షన్ సహాయంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ఎఫిషియెన్సీ టెస్ట్ లేదా ట్రాన్స్‌లేషన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉండగా 90 నిమిషాల వ్యవధిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనాలు లభించనుండటం గమనార్హం.