ప్రస్తుత కాలంలో చాలామంది రిలేషన్ లో ఉంటూ వారి రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ పెళ్లి బంధం లోకి అడుగుపెట్టడం లేదంటే కొన్ని కారణాలవల్ల రిలేషన్ షిప్ బ్రేకప్ అవడం జరుగుతూ ఉంటుంది.ఇలా కొందరు రిలేషన్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉండగా మరికొందరు మాత్రం తమకు లవర్ లేకపోవడంతో లవర్ లేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇలా రిలేషన్ లో లేకుండా సింగిల్ లైఫ్ గడపడం ఎంతో ప్రయోజనకరమని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ సమస్త ప్రేమలో ఉన్న వారిపైన అలాగే ఒంటరిగా జీవితం గడుపుతున్న వారిపైన పలు సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఒంటరి జీవితం గడిపేవారు చాలా సంతోషంగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడించారు. రిలేషన్ లో ఉన్నవారు తమ ప్రియుడు లేదా ప్రియురాలిని మెప్పించడం కోసం తెగ ప్రయత్నాలు చేయడం వల్ల మానసికంగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వారి దృష్టితో ప్రపంచాన్ని చూడటం వల్ల సొంత నిర్ణయాలు తీసుకుని అర్హతను కూడా కోల్పోతారు.
ఇలా సొంత నిర్ణయాలను తీసుకోలేకపోవడమే కాకుండా మానసికంగా కూడాఎంతో ఆవేద నచ్చిందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే ద్వారా నిపుణులు వెల్లడించారు అందుకే ఈ విధమైనటువంటి ఆందోళనల నుంచి బయట పడాలన్న లేకపోతే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలన్న ఒంటరి జీవితమే ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.