పెళ్లి బంధం తర్వాత చిన్నపాటి సమస్య తలెత్తితేనే తట్టుకోలేక విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. పెళ్లి బంధం లేదా ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలవాలంటే ఇద్దరి మధ్య ప్రేమానురాగాలతో పాటు ఆ బంధాలపై ఇద్దరికీ సరైన అవగాహన, నమ్మకం ,గౌరవం కచ్చితంగా ఉండాలి. అలా కాకుండా మీ రిలేషన్ లోఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునే విధంగా మీ మనస్తత్వం ఉంటే కొద్దిరోజుల్లోనే మీ రిలేషన్ బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ అధ్యయనం ప్రకారం విడిపోయిన వందలాది కపుల్స్, ప్రేమ జంటల పైన నిర్వహించిన సర్వే ప్రకారం చాలామంది కేవలం ఒక్క శుక్రవారం రోజునే ఎక్కువగా గొడవపడి చివరికి బంధాన్ని తెగతెంపులు చేసుకునే పరిస్థితికి వచ్చారని ఈ అధ్యయనం ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది.అందుకే కొత్తగా రిలేషన్ కొనసాగించే ముందు అవతలి వ్యక్తి మనస్కత్వాన్ని ఆలోచనలు, అలవాట్ల , కుటుంబ నేపథ్యం వంటి వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అమాయకంగా వారిని నమ్మి వారి వెంట నడిస్తే జీవితంలో ఎదురుదెబ్బలు తప్పవు.
ఒక కొత్త రిలేషన్ ప్రారంభిస్తున్నప్పుడు మన పార్ట్నర్ గుణగణాలను, వ్యక్తిత్వ స్వభావాన్ని అంచనా వేయగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. చిన్న వయసులోనే ప్రేమలు పెళ్లిళ్లు వంటి వ్యవహారాల జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. బంధాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వాటిని తప్పనిసరిగా ఇద్దరూ గౌరవించాలి అలా కాకుండా ఒకరి ఎమోషన్స్ ఒకరు హేళన చేసుకుంటే ఇద్దరి భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇద్దరి మధ్య దూరం ఒక్కసారి పెరిగితే దగ్గర అవడానికి చాలా సమయం పట్టొచ్చు.