వారంలో పొరపాటున కూడా ఈ రెండు రోజులు అగరబత్తులు వెలిగించకండి?

మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేవగానే వెంటనే శుభ్రం చేసి పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాతనే మిగిలిన పనులు మొదలుపెడతారు. ఇలా ప్రతిరోజు దేవుడిని పూజిస్తూ ఆరాధించడం వల్ల జీవితాంతం సుఖంగా సంతోషంగా జీవించే అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. ప్రతిరోజు దేవుడికి పువ్వులతో అలంకరించి దీపం వెలిగించి, అలాగే దేవుడి ముందు అగరవత్తులు కూడా తప్పనిసరిగా వెలిగిస్తారు. అగర్బత్తీలు వెలిగించకుండా చేసే పూజ అసంపూర్ణం అవుతుంది.

ఇలా సుగంధ పరిమళాలు వెదజల్లే అగరబత్తిలతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడికి పూజ చేసే స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటాము ఇలా సుగంధ పర్వనాలు వెదజల్లుతున్నటువంటి అగర్బత్తి వెలిగించడం వల్ల స్వామివారి ఆశీస్సులు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే ఇలా వారంలో అన్ని రోజులు అగర్బత్తిలు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.

వారంలో రెండు రోజులు అగరబత్తులు వెలిగించకుండా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ప్రతి రోజూ అగరబత్తిని వెలిగించే ఈ అలవాటుని మార్చుకోవాలి. ఎందుకంటే అగరబత్తిని మంగళవారం నాడు ఆదివారం నాడు వెలిగించకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం మంగళ వారం, ఆదివారం ఇంట్లో పూజా చేసినపుడు అగరవత్తులు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటె ఈ రెండు రోజులలో అగరబత్తిని వెలిగించడం వలన కుటుంబసభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు తలెత్తటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. అందుకే ఈ రెండు రోజులు అగరబత్తులు వెలిగించకపోవడం మంచిది.