ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధమైన పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి.కొందరు ప్రేమికులు తమ ప్రేమ వివాహం విషయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పెద్దల సమ్మతితో పెళ్లిళ్లు చేసుకుని ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరికొన్ని ప్రేమ జంటల విషయంలో కొన్ని సార్లు అమ్మాయి తల్లిదండ్రులు,అబ్బాయి కుటుంబంతో పెళ్లి జరిపేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇందుకు సమాజం ప్రధాన కారణమైతే. మరికొన్నిసార్లు కులం, మతం, ఆస్తి పాస్తులు లాంటి అడ్డుగోడలుగా నిలుస్తూ ప్రేమ వివాహానికి ఆటంకం కలిగిస్తుంటాయి. నీ ప్రేమను గెలిపించుకోవాలంటే జ్యోతిష నియమాలు తప్పకుండా పాటించాలనీ పండితులు చెబుతున్నారు.
ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ మీరు ప్రతిరోజు పాటిస్తే మీ ప్రేమ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయట ప్రేమ వివాహంలో అన్ని అడ్డంకులను తొలగించడానికి ఆదివారం పసుపు వస్త్రంలో 7 బెట్టు గింజలు, 7 పసుపు ముద్దలు, 7 బెల్లం ముక్కలు, 70 గ్రాముల శనగలు, 7 పసుపు నాణెలు మరియు ఒక యంత్రాన్ని తీసుకోండి. దీని తర్వాత పార్వతి దేవిని ఆరాధించండి. ఇలా 40 రోజులు పాటు ఆరాధన చేస్తే ప్రేమ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. జ్యోతి శాస్త్ర ప్రకారం నెలలో మొదటి బుధవారం నాడు విఘ్నేశ్వరుని పూజలు నిర్వహిస్తే మీ వివాహానికి ఎలాంటి ఆటంకాలు జరగవు మీ పెద్దలు సమ్మతి కూడా దొరుకుతుంది.
ప్రేమ వివాహంలో ఆటంకాలు తలెత్తుతుంటే మీరు డైమండ్ లేదా ఓపల్ రత్నాన్ని ధరించండి, 16 సోమవారాలు ఉపవాసం చేస్తూ ఓం గౌరీ శంఖర అర్ధాంగిని తవాం శంకర్ ప్రియా మామ్ కురు కల్యాణి కాంత సుదుర్లుభం అనే మంత్రాన్ని జపిస్తే అడ్డంకులన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. వ్యక్తుల జాతకంలో ఐదు, ఏడో స్థానాల్లో వివాహం స్థానం ఉంటుంది. ఐదో ఇంటికి అధిపతి చంద్రుడు. ఏడో పాదానికి అధిపతి సప్తముడు. ఈ యోగం ఏర్పడినప్పుడు ప్రేమ వివాహం జరుగుతుంది. ఇందుకోసం మీరు పంచమ స్థానానికి అధిపతి అయిన చంద్రుడిని సంతృప్తి పరచేందుకు ముత్యాలు ధరిస్తే ప్రేమ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ పారిపోతాయి.
