వంటింట్లో చెక్క వంట సామాన్లను ఉపయోగిస్తున్నారా?ఈ విషయాలు తెలుసుకోకపోతే కష్టపడాల్సి ఉంటుంది!

ఈ రోజుల్లో చాలామంది వంటింట్లో వంట సామాన్లను స్టీలు, కాపర్ వస్తువులకు బదులు చెక్కతో చేసిన వంట సామాన్లను ఉపయోగించడానికి మక్కువ చూపిస్తున్నారు. కారణాలు ఏవైనాప్పటికీ చెక్కతో చేసిన వంట వస్తువులు దుమ్ము ,దూళి, నూనెను ఎక్కువగా గ్రహించి తొందరగా మాసిపోయినట్లు కనిపిస్తుంటాయి. కావున సాధారణ వంట పాత్రలు శుభ్రం చేసుకునే విధానం చెక్కతో చేసిన వంట సామాన్లకు సరిపోదు. చెక్క వస్తువులను శుభ్రం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే మీ పని సులువు అవ్వడమే కాకుండా చెక్క వస్తువుల మన్నిక అందం మెరుగుపడుతుంది.

ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కాలను ఉపయోగించి చెక్క వంట సామాన్లను శుభ్రం చేసుకుంటే నూనె మరకలు దుమ్ముదులి తొలగిపోవడమే కాకుండా ప్రమాదకర బ్యాక్టీరియా ఫంగస్ వంటి సూక్ష్మజీవులు కూడా నశించిపోతాయి.
చెక్క వంట సామాన్లను శుభ్రం చేసుకునే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి చెక్క వంట సామాన్లను నానబెట్టి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మొండి నూనె మరకలు తొలగిపోవడమే కాకుండా ప్రమాదకర సూక్ష్మజీవులు కూడా నశించిపోతాయి.చెక్క వంట సామాన్లను శుభ్రం చేసుకున్న తర్వాత కూడా మొండి మరకలు అలాగే ఉంటే వాటిపై ఉప్పు చల్లి నిమ్మకాయను కట్ చేసి వాటిపై రుద్దితే నూనె మరకలు తొలగిపోతాయి.

చెక్క వంట సామాన్లపై నూనె మరకలను తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గం బేకింగ్ సోడా ను ఉపయోగించడం. ఇందుకోసం అధిక నూనె ఉండే వంట సామాన్లపై ముందుగా బేకింగ్ సోడాను చల్లుకొని కొద్దిసేపటి తర్వాత కట్ చేసిన నిమ్మకాయతో రుద్దితే జిడ్డు మరకలు తొలగిపోతాయి
చెక్క వంట సామాన్లు ఏవైనా దుర్వాసన వస్తుంటే వెనిగర్ మిశ్రమంలో కాసేపు నానబెట్టి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సాండ్ పేపర్ తో చెక్క వస్తువులపై అప్పుడప్పుడు రుద్దితే మొండి మరకలు సైతం తొలగిపోయి కొత్త వస్తువుల్లగా కనిపిస్తాయి.