భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టకపోవటానికి కారణం ఏమిటో తెలుసా..?

సాధారణంగా స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక బిడ్డకు జన్మనివ్వటం. వివాహం జరిగిన ప్రతి స్త్రీ సంతానం కోసం ఎంతో ఎదురుచూస్తుంది. అలాగే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వంశోద్ధారకుడు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం భార్య గర్భంతో ఉన్న సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భార్య గర్భంతో ఉన్న సమయంలో ఇంటి నిర్మాణ పనులు అస్సలు చేయకూడదు.

జీవితంలో ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. జీవితాంతం జీవించే ఆ ఇంటిని నిర్మించే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి అన్ని పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. అంతే కాకుండా ఇంటి నిర్మాణం అనేది అధిక ఖర్చు తో కూడుకున్న పని. అందువల్ల భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టరాడు. ఇంటి నిర్మాణ విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉండాలి. ఇలా రెండు బాధ్యత కలిగిన పనులు ఒకేసారి చేయటం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టకూడదని పండితులు చెబుతున్నారు.

అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల భార్యకి పని వత్తిడి పెరుగుతుంది. దీంతో ఆమె ఆరోగ్యం మీద కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించలేదు. పని ఒత్తిడి వల్ల తల్లి శిశువుల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కార్యకర్త గర్భవతిగా ఉన్న సమయంలో ఎల్లప్పుడూ భర్త అండగా ఉండాలి. ఆమెకు ఎటువంటి కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కారణాల వల్ల భార్య గర్భం తో ఉన్న సమయంలో నూతన గృహ నిర్మాణం చేయరాదు.