ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడటం ఎంతో మంచిది తెలుసా?

ప్రతి ఒక్కరూ తమ ఉదయాన్నే నిద్రలేచి ఆరోజు మొత్తం వారి జీవితంలో ఎలాంటి ప్రమాదాలు ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన దేవుడిని స్మరించుకుంటూ నిద్ర లేస్తుంటారు.అయితే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను కనుక చూస్తే మనకు ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోతుందని పండితులు చెబుతున్నారు.మరి ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి వస్తువులను చూడాలి ఏవి చూడకూడదు అనే విషయానికి వస్తే…

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వారికి ఇష్టమైన దేవుడి ఫోటోలను లేదా వారి బిడ్డలు వారికిఇష్టమైన వారి ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇలా చూడటం మంచిదని పండితులు చెబుతున్నారు ఇలా వారికి ఇష్టమైన వారి ఫోటోలను చూడటం వల్ల వారికి రోజు మొత్తం చాలా పాజిటివ్ గా సంతోషంగా గడుస్తూ ఉంటుంది. అలాగే తెల్లవారుజామున సుమంగళిని చూడటం ఆమె చేతిలో పూజాఫలాన్ని చూడటం కూడా ఎంతో శుభకరం.ఇక ఉదయం లేవగానే అద్దంలో మీ మొహాన్ని మీరు చూసుకోవటం కూడా మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మొహం కడుక్కొని అద్దంలో చూసుకోవడం ఎంతో మంచిది.

ఇక ఉదయం నిద్ర లేవగానే ఆవును చూడటం కూడా సకల దేవతలను చూసినట్టే అవుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే పాలు పెరుగు వంటి పదార్థాలను చూడటం కూడా శుభ పరిణామం. ఇక ఉదయం లేవగానే పల్లెటూర్లలో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి. ఇలా పక్షుల ధ్వనులు విన్నా కూడా శుభమని పండితులు చెబుతున్నారు. ఇక ఉదయం నిద్ర లేవగానే గుడిలో గంటల శబ్దం విన్నా కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.ఇక ఉదయం పొరపాటున కూడా కొన్ని వస్తువులను చూడకూడదు అలాంటి వాటిలో భయంకరమైన జంతువుల ఫోటోలను చూడకూడదు. క్రూర జంతువుల ఫోటోలు కనుక చూస్తే ఆరోజు మొత్తం మనలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. అలాగే రాత్రి తిని పెట్టిన పాచి గిన్నెలను కూడా ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు ఇలాంటివి చూడటం వల్ల ఆ రోజు మొత్తం ఎన్నో ఆటంకాలు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.