శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనే సమయంలో కొందరు ఎన్నో అపోహలను పెట్టుకొని ఉంటారు. మరికొందరు శృంగారం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శృంగారంలో పాల్గొనాలనుకునే దంపతులు ముందుగా మూత్ర విసర్జన చేయాలని కొందరు అవసరం లేదని మరికొందరు అపోహ పడుతుంటారు మరి ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు వారి సలహా ఏంటి అనే విషయానికి వస్తే….

శృంగారంలో పాల్గొనే ముందు తప్పనిసరిగా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా మూత్ర విసర్జన చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా మూత్ర విసర్జన చేయడం వల్ల శృంగారంలో పాల్గొన్న సమయంలో వారి దృష్టి మొత్తం వారు ఏకాంతంగా సంతోషంగా గడపడం పైనే ఉంటుంది. అలా కాకుండా తమ మూత్రశయం నిండుగా ఉన్నప్పుడు తమ దృష్టి మొత్తం మూత్రశయం పైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే మూత్రశయానికి వెళ్లకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్నిసార్లు అంటూ వ్యాధులు కూడా వచ్చే ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భార్య భర్తలు లైంగికంగా కలిసినప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా తరచూ జననేంద్రియాల వద్ద దురద మంటగా ఉండడం జరుగుతుంది.అందుకే శృంగారానికి ముందు శృంగారానికి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా మూత్ర విసర్జన వెళ్లడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వీలైతే శృంగారం తర్వాత స్నానం చేయడం ఇంకా మంచిదని నిపుణుల అభిప్రాయం.