సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 74 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కన్సల్టెంట్ పోస్టుల కోసం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా 2023 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

cpcb.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కన్సల్టెంట్ ఎ, కన్సల్టెంట్ బి, కన్సల్టెంట్ సి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏ కేటగిరీలో 19 ఉద్యోగ ఖాళీలు ఉండగా బి కేటగిరీలో 52 ఉద్యోగ ఖాళీలు, సి కేటగిరీలో 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గరిష్టంగా 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

కన్సల్టెంట్ ఎ కేటగిరీ ఉద్యోగాలకు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ లేదా సైన్స్ లో టెక్నాలజీలో డిగ్రీ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ  అర్హులు. కన్సల్టెంట్ బీ కేటగిరీ విషయానికి వస్తే అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 60,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది.

https://cpcb.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.