బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏకంగా 146 ఉద్యోగ ఖాళీలు.. ఒకింత మంచి వేతనంతో?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీడీబీఏ ఉద్యోగ ఖాళీలు 1 ఉండగా రేడియన్స్ ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.

గ్రూప్ హెడ్ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా టెరోటెరి హెడ్ ఉద్యోగ ఖాళీలు 17 ఉన్నాయి. సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 101 ఉండగా వెల్త్ స్ట్రాటజిస్ట్ ఉద్యోగాలు 18 ఉన్నాయి. ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఉద్యోగ ఖాళీలు 1 ఉండగా పోర్ట్ పోలియో రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ 1 ఉంది. మొత్తం 146 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 22 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల వరకుపోస్టును బట్టి, అర్హతను బట్టి ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 6 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ చేయాలని భావించే వాళ్లకు ఇది ఒక విధంగా బంఫర్ ఆఫర్ అని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.