పురుషుల జీవితంలోని చాలా విషయాలు స్త్రీలతో ముడిపడి ఉండడం సహజమైన సర్వసాధారణమైన విషయమే. కావున స్త్రీల యొక్క గుణ గణాలే పురుషుల ఎదుగుదలను నిర్ణయిస్తాయని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో వివరించడం జరిగింది. ఆచార్య చాణిక్యుడు రచించిన సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక విధానాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఆచార్య చాణిక్యుడు చాణిక్యనీతి శాస్త్రంలో స్త్రీల యొక్క లక్షణాలు, గుణగణాల గురించి వివరిస్తూ ఇలాంటి స్త్రీలు పురుషుల జీవితంలో ఉంటే పురుషులు ఎన్నో విజయాలను సాధిస్తారని పేర్కొన్నారు.
ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు మనస్తత్వం ఉన్న స్త్రీని పెళ్లాడితే పురుషులు అదృష్టవంతులు అవుతారని చాణిక్య నీతి చెప్తోంది. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం.ఆచార్య చాణక్యు నీతి ప్రకారం, ఇంటి పెద్దలను గౌరవించే మరియు చిన్నవారిని ప్రేమించే స్త్రీని వివాహం చేసుకోవడం అదృష్టం. ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు, సిరులు ఎల్లప్పుడూ తాండవిస్తాయ్. ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీ పరిష్కరించగలదు. కల్మషం లేని మనసు, మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ మీ జీవితంలో ఉంటే మీ సుఖ సంతోషాలకు కొదవే ఉండదు.ఇలాంటి మహిళలు తమ ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, శుభ్రంగా అలంకరించి ఉంచుతారని చాణక్య నీతి చెప్తోంది
చీటికిమాటికి చిరాకు పడి కోపం తెచ్చుకునే మహిళ మీ జీవితంలో ఉంటే మీకు సంతోషం కరువైనట్లే. అదే ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కోపమంటే ఎరుగని మహిళ మీ జీవితంలో ఉంటే మీ జీవితం స్వర్గధాయమవుతుంది.స్త్రీలు పాశ్చాత్య పోగడాలకు బానిస కాకుండా మన సాంప్రదాయ ధర్మాలకు విలువనిచ్చి ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తే మన ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు. అటువంటి స్త్రీలు మనిషి జీవితంలోని ప్రతి సమస్య తొలగిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సహనం కోల్పోని మహిళ మీ జీవిత భాగస్వామి అయితే మీ విజయం మీ వెంటే నడుస్తుంది అని చెబుతోంది చాణిక్య నీతి.