ప్రస్తుత కాలంలో ఈ ఉరుకులు పరుగుల కాలంతో పాటు మనం కూడా పరుపులు తీయాలంటే తప్పనిసరిగా ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. ఈ క్రమంలోని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగ నిర్వహణలో భాగంగా తమ పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమై పూర్తిగా ఒంటరితనానికి గురవుతున్నారు. అయితే పనులలో ఎంతో బిజీగా ఉన్నా పిల్లలతో సరదాగా గడిపినప్పుడే వారితో మనకు మంచి అనుబంధం ఏర్పడుతుంది.
మన పనులను కరెక్ట్ సమయానికి చేస్తూ పిల్లలతో సమయం గడపాలంటే ముందుగా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.మనం ఎంత పనిలో ఉన్నప్పటికీ పిల్లలు నిద్ర లేవగానే వారితో ఒక పది నిమిషాలు మాట్లాడటం అలాగే టిఫిన్ లంచ్ చేసే సమయంలో వారితో సరదాగా నవ్వుతూ ప్రేమగా మాట్లాడటం మంచిది. ఇక చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం అలవాటు ఉంటుంది అలాంటి సమయంలో ఒంటరిగా కాకుండా మీతో పాటు పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లడం మంచిది.
ఈ విధంగా పిల్లలతో పాటు కలిసి వెళ్లడం వల్ల వారితో కొంత సమయం గడిపే అవకాశం లభిస్తుంది.వర్క్ టెన్షన్స్ ఉన్నప్పుడు పిల్లలు మాట్లాడించిన భరత టెన్షన్తో పిల్లలపై కోపం తెచ్చుకోకూడదు వారితో మాట్లాడేటప్పుడు మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మరిచిపోయి పిల్లలతో నవ్వుతూ మాట్లాడాలి. అలా వారితో కలిసి ఫోటోలు వీడియోలు దిగటం వల్ల పిల్లలకు మన పట్ల ప్రేమాప్యాయతలు పెరుగుతాయి. ఇక సాయంత్రం సమయంలో పిల్లలు ఆడుకునే సమయంలో మీరు కూడా వారితో కలిసి ఆడుకోవడం మంచిది. అదేవిధంగా పిల్లలతో కలిసి సరదాగా పార్క్ లేదా జూకి వెళ్లడం వల్ల పిల్లలకు సరదాగా ఉంటుంది. అలాగే మీకు కాస్త సమయం దొరికినప్పుడు పిల్లలని స్వయంగా స్కూల్ కెళ్ళి తీసుకురావడం లేదా స్కూల్ కి దింపడం వంటివి చేయటం వల్ల మనతో వారికి ఎంతో మంచి అనుబంధం ఉంటుంది.