ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయితే మీ కంటే అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. కానీ ఈ రోజుల్లో రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం చాలా కష్టం ఇప్పుడు అంతా కమర్షియల్ గా ఆలోచించడం మొదలెట్టారు. లేకపోతే తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం పెళ్లిళ్లు చేసుకోవడం చేసుకున్న వెంటనే ఒకరినొకరు అర్థం చేసుకోలేక పెళ్లయిన ఏడాదికి విడిపోవడం ఇదంతా సరసాధారణంగా జరుగుతోంది.
నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ జీవితంలో ఉంటే తాను నీపై శ్రద్ధ చూపిస్తున్నాను అనే విషయం
అందరూ తెలుసుకోవాలి అని ఆరాటపడడు. ఎవరు చూసినా చూడకున్నా తాను మాత్రం మీ పట్ల ఎంతో ఆప్యాయత శ్రద్ధ చూపిస్తాడు మీ తర్వాతే ఏదైనా అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మిమ్మల్ని అన్ని విధాలుగా మంచి వ్యక్తిగా మారుస్తాడు. వారు మీ కలలను సాధించడానికి మిమ్మల్ని ఆ దిశగా నడిపించడంతోపాటు అవసరమైతే నీవు వేసే ప్రతి అడుగులో నీ వెంటే ఉంటారు. శారీరకంగా సంతోషించ పెట్టేవారు చాలా మందే ఉంటారు.కానీ మీ పట్ల నిజాయితీగా ఉంటూ మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తాడు. మిమ్మల్ని ఎప్పుడూ సురక్షితంగా ఉంచడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీ అవసరాలను మీకంటే ముందే గ్రహించి వాటిని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా భరిస్తారు.మిమ్మల్ని మోసం చేయాలనుకునేవారు వారి వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ మీ ముందు ప్రస్తావించరు. అదే మిమ్మల్ని ప్రేమించే వారు తనకు సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లడానికి అనుమతించరు. అలాగే మీ ఆలోచనలను అణిచివేసే నియంతలా కూడా వ్యవహరించరు. మీ కలలు మీ ఆశయాలను సాధించడానికి మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుంటే అంతకంటే దురదృష్టం మరొకటి లేదు.