నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీ వేతనంతో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు!

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 87 పోస్టుల భర్తీ జరగనుండగా ఈ పోస్టులలో కార్యకర్త పోస్టులు 11, మినీ కార్యకర్త పోస్టులు 18 ఉన్నాయి.

హెల్పర్ పోస్టులు మొత్తం 58 ఉండటం గమనార్హం. పదోతరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించడం ద్వారా ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి పాసైన వాళ్లు అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

2024 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లు కూడా అంగన్ వాడీ కార్యకర్త జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు. అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం 11500 రూపాయలు కాగా మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం 7000 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.