ఏపీ ఉపాధి, శిక్షణ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలతో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 71 అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మార్చి 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://detrecruitments.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ జాబ్స్ 71 ఉండగా వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వేర్వేరు అర్హతలు ఉంటాయి. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్షతో పాటు ప్రాక్టికల్ డెమో కూడా నిర్వహిస్తారు.

ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ కలుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు మేలు చేయనున్నాయి.