చంద్రమోహన్ తెలుగు సినీ నటుడుగా అందరికీ సుపరిచితమే. ఇతను దర్శక నిర్మాత కె. విశ్వనాథ్ దగ్గర బంధువు. చంద్రమోహన్ 1966 లో రంగులరాట్నం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 1968 లో వచ్చిన సుఖదుఃఖాలు సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందడం జరిగింది.
1978లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమా చంద్రమోహన్ కెరీర్నే మలుపు తిప్పింది. ఇక వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సినీ ఇండస్ట్రీలో రాణించడం జరిగింది. హీరోగా, హాస్యనటుడుగా దాదాపుగా 400కు పైగా చిత్రాలలో నటించడం జరిగింది.
ఇలా తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని.. ముందుకు రాణిస్తున్న చంద్రమోహన్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో ప్రస్తుతం కొనసాగుతున్న హీరోలు షూటింగ్లలో తనతో ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించడం జరిగింది.
అందుకు చంద్రమోహన్, జూనియర్ ఎన్టీఆర్ తనకు చిన్నప్పటినుండి తెలుసని షూటింగ్లో ఎక్కడ కనపడిన పక్కన కూర్చొని చాలా మర్యాదగా మాట్లాడతాడని తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో ఒకేసారి డైలాగ్ చెప్పి షార్ట్ ఓకే అనిపించుకున్న ఘనత ఒక జూనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుందని చెప్పడం జరిగింది.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే తాను ఎక్కడ కనిపించినా నమస్కారమండి అంటూ దండం పెడతాడు. తన బాగోగులు అడిగి తెలుసుకుంటాడని తెలిపాడు. ఇక రెండవ ప్రశ్నగా సినీ ఇండస్ట్రీలో చనువుగా మాట్లాడే హీరోలు ఎవరని ప్రశ్నించడం జరిగింది.
అందుకు చంద్రమోహన్ సినీ ఇండస్ట్రీలో అందరితోనూ సన్నిహితంగా ఉంటానని చెబుతూ మోహన్ బాబు, చంద్రమోహన్ లతో మాత్రం చాలా చనువుగా ఉంటానని మంచి స్నేహితులుగా తమ మధ్య ఎప్పుడు మనస్పర్ధలు అనేవి రాలేదని తెలిపాడు.
ఇక ఆ ఇంటర్వ్యూ ద్వారా తాను చనిపోయానంటూ గతంతో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లానని, తన ఆరోగ్యం బాగానే ఉన్నా బయట మాత్రం విషమంగా ఉందని వార్తలు వినిపించాయి. మరికొందరైతే ఏకంగా చనిపోయారంటూ ప్రచారం కూడా చేశారు.
ఇలా ప్రచారం చేయడం తనకు చాలా బాధ అనిపించిందని.. వాస్తవాలు తెలియకుండా అనవసర వార్తల ద్వారా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపాడు. ఎవరైనా ఏదైనా వింటే అందులో వాస్తవం ఉందో లేదో ముందు గ్రహించాలి ఆ తర్వాతే బయట చెప్పాలి అంటూ పేర్కొనడం జరిగింది.
ఇక హీరోగా, హాస్యనటుడుగా సినిమాలలో విభిన్న పాత్రలు పోషించిన చంద్రమోహన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు.