ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎం.ఎస్.ఎం.ఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండగా మొత్తం 250 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాలలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, మహిళలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
2023 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 28 నుంచి 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 63840 రూపాయల నుంచి 78230 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ పరీక్షతో పాటు సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్యపరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
2023 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.