‘బిగిల్’ కోసం గొంతు విప్పిన తమిళ సూపర్ స్టార్ విజయ్

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన తాజా చిత్రం ‘బిగిల్’ కోసం గొంతు విప్పారు. దర్శకుడు అట్లీ తో ఇది వరకే హిట్ సినిమాలు అందించిన విజయ్ ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట.

ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నయనతార నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో వివేక్, జాకీ షరాఫ్ మొదలైన వారు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు చివరికల్లా పూర్తి చేసి దీపావళికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.