ట్విట్టర్ రివ్యూ : “పొన్నియిన్ సెల్వన్”..మణిరత్నం డ్రీం సినిమా ఏమైంది?

పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చిన మరో చిత్రమే “పొన్నియిన్ సెల్వన్ 1”. తమిళ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సహా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ఇది వచ్చింది.

చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, అలాగే ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, జయరాం ఇలా ఎంతో మంది అగ్ర నటుల కలయికలో దిగ్గజ ఫిల్మ్ మేకర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ ఈరోజూ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

అయితే ఇక ఈరోజు తెల్లవారు తోనే ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు ట్విట్టర్ లో బయటకి వచ్చేసింది. ఈ చిత్రం చూసిన ఆడియెన్స్ అయితే మాత్రం అంత సంతోషంగా లేరని చెప్పాలి. ముఖ్యంగా మణిరత్నం అభిమానులు చాలా డిజప్పాయింట్ అవ్వక తప్పదట.

తాను ఈ చిత్రాన్ని ఇంకా బాగా చేయాల్సింది అని తన రేంజ్ వర్క్ అయితే ఇది కాదని అంటున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా అంత బాగాలేదు. కానీ సెకండాఫ్ బెటర్ అంటున్నారు. ఇంకా యుద్ధ సన్నివేశాలు, ఏ ఆర్ స్కోర్, బాగున్నాయట. కానీ హీరో విక్రమ్ కి సరైన నిడివి సినిమాలో లేదట.

కేవలం కార్తీ మాత్రమే ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ కనిపిస్తాడని అంటున్నారు. ఒక మొత్తంగా అయితే ఫ్యాన్స్ కి ఈ చిత్రం నచ్చొచ్చు ఏమో కానీ పూర్తి స్థాయిలో సినిమా అనుకున్న రేంజ్ అందుకోకపోవడం ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ కి అర్ధం అయ్యేలా ఉండదని అంటున్నారు.