తెలుగు, తమిళ భాషల్లో అడపాదడపా చిత్రాలు చేస్తూ ఫేమస్ అయింది నిక్కీ గల్రానీ. అయితే సినిమాల కంటే ఆది పినిశెట్టితో ఉన్న రహస్య సంబంధమే నిక్కీని ఎక్కువగా పాపులర్ చేస్తోంది. మొన్నామధ్య ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి బర్త్ డే వేడుకల్లోనూ మెరిసి అందరిలో ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. తాజాగా నిక్కీ కరోనా బారిన విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.
‘అందరికీ హాయ్.. గత వారం జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా గురించి బయట ఏదేదో ప్రచారం జరుగుతోంది. అయితే నాకు ఎదురైన అనుభవాల గురించి చెబుతాను. రుచి కోల్పోవడం, గొంతు నొప్పి, ఫీవర్ వంటి లక్షణాలతో బాధపడ్డాను. మొత్తానికి.. ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ రికవర్ అవుతున్నాను. ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నందుకు ఎంతో లక్కీ.
ప్రస్తుతమున్నది క్లిష్ట పరిస్థితి అని తెలుసు. మనం జాగ్రత్తగా ఉండటం ఇప్పుడు ఎంతో అవసరం. పక్కవారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. నా వయసు, ఇంతకు ముందు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకపోవడంతో త్వరలోనే దీని నుంచి బయటపడతానని ఆశిస్తున్నాను. అయితే నా తల్లిదండ్రులు, పెద్దవారు, స్నేహితులకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని గురించి ఆలోచించినప్పుడు నాకు భయం వేస్తుంది. కాబట్టి అందరూ మాస్క్ ధరించండి. ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి.
నెలల తరబడి రోజూ ఇంట్లోనే కూర్చొని ఉండటం చిరాకు పుట్టిస్తుందని తెలుసు. కానీ ప్రస్తుతం మనం అనూహ్యమైన సంఘటనలు చూస్తున్నాం. జీవిస్తున్నాం. మనవంతుగా సమాజానికి అదే చేయాలి. ఫ్యామిలీతో సమయాన్ని గడపండి.. స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి..మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎవరైనా శ్వాస అందక, డిప్రెషన్‌తో ఇబ్బంది పడితే వెంటనే సాయం చేయండి. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’ అని అందరికీ సూచించింది.