5000 స్క్రీన్ల‌లో సూప‌ర్‌స్టార్ ‘మ‌ర‌క్కార్’. నాగార్జున కీలక పాత్ర

Marakkar

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌ర‌క్కార్’. ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడు. ఆశీర్వాద్ సినిమాస్ ప‌తాకంపై పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. నాగార్జున ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. మార్చి 26న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా  రిలీజ్ కానుంది. మ‌ల‌యాళంలో హైయ్యెస్ట్ అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఏకైక చిత్ర‌మిద‌ని చెబుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టే దాదాపు 5000 స్క్రీన్ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నార‌ని తెలుస్తోంది. నేడు మ‌ర‌క్కార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లాల్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహ‌న్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీగా తెర‌కెక్కి రిలీజ‌వుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీలో ఈ సినిమా రిలీజ‌వుతుంది. ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో నాలుగు 100 కోట్ల క్ల‌బ్ చిత్రాలు ఆయ‌న నుంచి వ‌చ్చాయి. ఇక సైరా త‌ర‌హాలోనే అత్యంత భారీగా పాన్ ఇండియా కేట‌గిరీలో వ‌స్తున్న సినిమాగా మ‌ర‌క్కార్ పాపుల‌ర‌వుతోంది.