లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్కరణ్ అజ్ఞాతంలోకి వెళ్లారా? అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఎవరికీ కనిపించడం లేదా? అంటే చెన్నయ్ వర్గాల్లో అవుననే ప్రచారం సాగుతోంది. 2.0 నిర్మాత దాదాపు రూ.186 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తూ చెన్నై పోలీస్ కమీషనరేట్ లో ఫిర్యాదు చేయడానికి బాధితులు సిద్ధం అవుతున్నారని ప్రచారమవుతోంది.
కత్తి సినిమా మొదలు ఇప్పటికే పలు భారీ చిత్రాల్ని నిర్మించిన సదరు సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉండడమే ఇందుకు కారణమని సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా 2.0 చిత్రం వల్ల ఈ కష్టాలు తప్పలేదని చెబుతున్నారు. బయ్యర్లు, పంపిణీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ఇప్పుడు మరోసారి అంత పెద్ద అప్పు విషయమై ఒత్తిడి మొదలవ్వగానే ఆయన జంప్ అని చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్, కమల్ హాసన్ తో ఇండియన్-2 సినిమాలు ఇబ్బందుల్లో పడ్డట్టేనంటూ విశ్లేషిస్తున్నారు. లైకా అధినేత అజ్ఞాతం వీడితేగాని సరైన స్పష్టత రాదు. అసలు ఇది నిజమా కాదా? అన్నదానికి అధికారికంగా ధృవీకరించడానికి లేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. మరోవైపు భారతీయుడు 2 చిత్రీకరణ ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.