లేటెస్ట్ అప్డేట్ : రజినీకాంత్ సరసన మొట్టమొదటి సారి యాక్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ..?

పాన్ ఇండియా మార్కెట్ లో ఎంతో మంది స్టార్స్ ఉండొచ్చు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్ రియల్ క్రేజ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకాంత్ సినిమాలకి పిచ్చ క్రేజ్ ఉంది.

ఇక ఇదిలా ఉండగా రజినీకాంత్ అయితే ప్రస్తుతం ఓ భారీ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే “జైలర్”. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పై గతంలో పలు అప్డేట్స్ గాసిప్స్ బయటకి వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈ భారీ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఫిక్స్ అయ్యినట్టుగా ఇప్పుడు తమిళ్ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అంతే కాకుండా ఈ కాంబోలో ఇదే మొదటి సినిమా అన్నట్టుగా కూడా తెలుస్తుంది.

దీనితో అయితే ఇది వరకు వచ్చిన రూమర్స్ ఐశ్వర్య రాయ్ నటిస్తుంది అనే వాటిలో ఎలాంటి నిజం లేదని అనుకోవచ్చు. దీనితో అయితే ఇప్పుడు ఈ ఫ్రెష్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కె ఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.