‘ఉప్పెన’:విజయ్ సేతుపతికు షాకిచ్చే రెమ్యునేషన్

 ‘ఉప్పెన’… విజయ్ సేతుపతికు బాగా ముట్టచెప్పారు

మెగా యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అసిస్టెంట్‌ బుచ్చి బాబు సాసా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు. అయితే ఆయన తన తమిళ సినిమాలు ప్రక్కన పెట్టి తెలుగులో చేయటానికి బాగానే ఛార్జ్ చేసినట్లు సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినపడుతున్న దాని ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి 5 కోట్లు దాకా ఛార్జ్ చేసారట. మొదట ఎక్కువ అనిపించి వేరే నటుడుని తీసుకుందామనుకున్నా…దర్శకుడు ఆయనే కావాలని పట్టుబట్టడంతో ఆ మొత్తాన్ని ఇచ్చి ఒప్పించినట్లు చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతిని తీసుకోవటం ద్వారా తమిళంలోనూ ఈ సినిమాను భారిగా రిలీజ్ చేయవచ్చని భావిస్తున్నారు.

విజయ్‌ సేతుపతి ‘ఉప్పెన’లో హీరోయిన్ తండ్రిగా నెగిటివ్‌ రోల్‌ కనిపిస్తారని చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌లో విజయ్‌పై ఎక్కువ సన్నివేశాలు షూట్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇందుకోసం ఓ ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ వేశారట. ‘సైరా’లో చిరంజీవితో కలిసి నటించిన విజయ్‌ చిరు మేనల్లుడు సినిమాలోనూ కనిపిస్తుండటం విశేషం గా చెప్పుకుంటున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది.