వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతోంది..!?

 

వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతోంది..!?

‘ఎస్.. అవును..మీరు వింటున్నది నిజమే!?  నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్. గత కొంతకాలంగా ఈ అమ్మడుపై మీడియాలో చాల వార్తలు గుప్పుమన్నాయి. నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే వరలక్ష్మిగురించి పెళ్లి వార్తల పుకార్లు షికారు చేశాయి.

హీరో విశాలతో పెళ్లి అని ఓ సారీ, మరో యంగ్ డైరెక్టోతో పెళ్లి అని ఇలా రకరకాలుగా దుమారం రేగింది. ఎప్పటికప్పుడు వరలక్ష్మిఈ వార్తలను  కొట్టిపారేసింది. ఇక లాభం లేదనుకున్న వరలక్ష్మి తన పెళ్లి విషయాన్నీఇటీవల ఓ సందర్భంలో మీడియా ముందు  ప్రకటించింది. ఆయితే.. వరుడు ఇండస్ట్రీకి చెందినవాడు కాదని చెప్పేసింది. బిజినెస్సుమన్ అని కూడా తేల్చేసింది. త్వరలోనే పూర్తి వివరాలు కూడా చెబుతానంది.