నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీ వేతనంతో 709 ఉద్యోగ ఖాళీలు!

 

విశ్వభారతి విశ్వవిద్యాలయం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 709 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్, క్లర్క్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. వేర్వేరు జాబ్స్ భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

 

vbharatirec.nta.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 709 ఉద్యోగాలలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు ఏకంగా 405 ఉన్నాయి. మే నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంటుందని సమాచారం అందుతోంది.

 

రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్ తో పాటు మెడికల్‌ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. గ్రూప్ ఏ ఉద్యోగ ఖాళీలకు 2000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా గ్రూప్ బీ ఉద్యోగ ఖాళీలకు 1200 రూపాయలు, గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీలకు 900 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.20, 200 నుంచి రూ.67,000 వేతనం లభిస్తుంది. రాతపరీక్ష వెయిటేజీ, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.