Swag Movie: ‘శ్వాగ్’ శ్రీవిష్ణు గారి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆడియన్స్ ని చాలా సర్ ప్రైజ్ చేస్తాయి: డైరెక్టర్ హసిత్ గోలి

Swag Movie: కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ హసిత్ గోలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమా అనౌన్స్మెంట్ లో అచ్చ తెలుగు సినిమా అని చెప్పారు కదా.. మరి ‘శ్వాగ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి కారణం? ఇందులో తెలుగు ఇంపార్టెన్స్ ఎలా వుంటుంది?

-ఈ సినిమా నెరేషన్ విన్న వివేక్ గారు అచ్చ తెలుగు సినిమాలా వుంది, టైటిల్ ఏమిటని అడిగారు. శ్వాగ్ అని చెప్పగానే ఆయన సర్ప్రైజ్ అయ్యారు. అలా అచ్చ తెలుగు సినిమాలా అనిపించడానికి కారణం వుంది. ఇందులో చాలా రూటెడ్ విషయాలు వుంటాయి. వంశ వృక్షం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ అది సినిమాల్లోకి తీసుకురావడం అరుదు.

-ఇందులో డిఫరెంట్ జనరేషన్స్ టచ్ చేశాం. సింగా క్యారెక్టర్ ప్రజెంట్ జనరేషన్. అలాగే 90కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. దాని కంటే ముందుకు వెళితే 70కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే.. మూల పురుషుడికి సంబంధించినంత వరకు వెళ్దాం అనే ఆలోచనతో చేసిన స్క్రిప్ట్ ఇది. రాజులకు సంబంధించిన క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ అవసరం పడదు. అక్కడ స్వచ్ఛమైన తెలుగ ఉంటుంది. ఇందులో అచ్చ తెలుగు విషయాలే ఉన్నాయి. అలాగే రూటేడ్ కల్చర్ ఉంది. ఇది ఒక వంశానికి సంబంధించిన కథ. ప్రతి జనరేషన్ లో విష్ణు గారి క్యారెక్టర్ ఉంటుంది.

Swag Movie: శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఇంగ్లాండు రాణి సాంగ్ రిలీజ్

ఇందులో ఎలాంటి సందేశం ఉంటుంది?

-సందేశం కోసం తీసిన సినిమా కాదు ఇది. మగ-ఆడ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉండేది వంశం. ఈ రెండిటిని లింక్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా కనిపించింది. మాతృస్వామ్య వ్యవస్థ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. దాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సందేశం కాదు గాని.. తరతరాలుగా మగ ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది, ఇప్పటికి దాని రిలవెన్స్ ఏంటి అనే ఆలోచనతో చేసిన కథ.

యయాతి, భవభూతి క్యారెక్టర్స్ గురించి ?

– యయాతి పేరు పురాణాలలో ఉన్నదే. యదు వంశానికి సంబంధించిన రాజు. ఈ సినిమాలో పేర్లని రిధమిక్ గా పెట్టాలని అనుకున్నాం. అందుకే భవభూతి. యయాతి పేర్లని క్యారెక్టర్స్ కి పెట్టాం. ఇందులో నాలుగు క్యారెక్టర్లకి సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ నాలుగు క్యారెక్టర్స్ కలిసి ఎలాంటి కథ చెప్పబోతున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్.

మొత్తం నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా.. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది?

– స్క్రీన్ ప్లే లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ కథ రాస్తున్నప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాం. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ కి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ ప్లే లీనియర్ గా వెళ్తూనే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది .

-చాలా మంచి కథ ఇది. విష్ణు గారు నుంచి కోరుకునే ఫన్ ఉంటుంది. ఆ ఫన్ కూడా కథలో చాలా ఆర్గానిక్ గా కుదిరింది. ఇందులో ఫన్, కథకి ఢోకా ఉండదు. ఇంటర్వెల్ బ్లాకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

రీతూ వర్మ క్యారెక్టర్ గురించి ?

-రీతు గారికి స్ట్రాంగ్ లేడీ స్క్రీన్ పర్సోనా వుంది. వింధ్యామర వంశ రాణిగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ ని ఆమె చేస్తేనే పర్ఫెక్ట్ అనుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

శ్రీవిష్ణు, హసిత్ గోలి ‘శ్వాగ్’ నుంచి హైలీ ఎంటర్ టైనింగ్ ‘రేజర్’ టీజర్ రిలీజ్

శ్రీ విష్ణు గారు ఇలాంటి గెటప్స్ తో సినిమా చేయడం ఇదే తొలిసారి కదా ఎలా ప్రిపేర్ అయ్యారు ?

– శ్రీ విష్ణు గారికే కాదు.. మా టీమ్ అందరికీ ఇలాంటి గెటప్స్ తో ఉన్న కథ చేయడం కొత్త. అందరం ఒక ఛాలెంజ్ లా తీసుకుని సినిమా చేశాను. శ్రీ విష్ణు గారు చాలా ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేశారు. విష్ణు గారు కాకుండా ఆయన చేసిన క్యారెక్టర్స్ కనిపించాయి. కథని ముందుకు తీసుకెళ్లడానికే ఎఫర్ట్ పెట్టారు.

-భవభూతి క్యారెక్టర్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. యయాతి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. అవి మీరు తెరపైన చూడాలి.

-నాలుగు క్యారెక్టర్స్ లో స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని మొదటి నుంచి అనుకున్నాం. భారతీయుడు లాంటి సినిమాలు చేసిన నేషనల్ అవార్డు విన్నర్ రషీద్ గారు దీనికి ప్రోస్తస్టిక్స్ చేశారు.

మీరాజాస్మిన్ గారు క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఈ కథ ఆవిడకి చాలా నచ్చింది. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని నేను ఎక్స్ పెక్ట్ చేయలేదని చెప్పారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి?

– రాజరాజ చోరకి కలిసి పని చేశాం. బ్యాక్గ్రౌండ్ స్కోరు వివేక్ సాగర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. అది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది.

ఈ సినిమాకి పార్టీ 2 ఉంటుందా?

-కొనసాగింపు ఉండే అవకాశం ఉన్న కథ ఇది. ఇది వంశానికి సంబంధించిన కథ. ఆ క్యారెక్టర్స్ లో ఎవరి కథ అయినా రాసుకోవచ్చు. అయితే ఈ సినిమా వరకు మాత్రం ఈ కథ పూర్తవుతుంది.

శ్రీ విష్ణు, హసిత్ గోలి, ‘శ్వాగ్’ క్రేజీ & ఫన్-ఫిల్డ్ టీజర్ లాంచ్

ప్రొడక్షన్ డిజైనర్ గురించి?

-జిఎం శేఖర్ గారు ప్రొడక్షన్ డిజైనర్. ఇందులో వంశ వృక్ష నిలయం అనే ఒక ప్లేస్ ని క్రియేట్ చేసాం. దానికోసం ఒక సెట్ ఏర్పాటు చేశాం. అది చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. చాలా రూటేడ్ గా ఉంటుంది.

నెక్స్ట్ ఎలాంటి కథ చేస్తున్నారు?

– నెక్స్ట్ కథపై ఐడియాస్ ఉన్నాయి కానీ.. వాటిని ఇంకా ఎక్స్ ఫ్లోర్ చేయాలి. ఫాంటసీ నాకు చాలా ఇష్టమైన జోనర్. ఆ జోనర్ లో సినిమా చేయాలని వుంది.