SJ Suryah: రామ్ చరణ్ గొప్పగా నటించిన ‘గేమ్ చేంజర్’ అద్భుతంగా ఉండబోతోంది: ఎస్ జే సూర్య

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో జోరు పెంచింది. క్రమంలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

‘గేమ్ చేంజర్’ అవకాశం ఎలా వచ్చింది? శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది?

శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్‌లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.

రామ్ చరణ్ గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?

రామ్ చరణ్ గారు అద్భుతమైన నటులు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ స్టార్‌లో ఓ గొప్ప నటులున్నారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.

గేమ్ చేంజర్‌లో పని చేస్తున్నప్పుడు మీలో ఉన్న దర్శకుడు ఎప్పుడైనా బయటకు వచ్చారా?

ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీద దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. అయినా శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.

చాలా రోజుల తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా?.. ఆ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?

మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది. ఖుషీ టైంలో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ గురించి చెబుతుండేవారు. కానీ నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు.

‘గేమ్ చేంజర్’ చిత్రం ఎలా ఉండబోతోంది?

ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.

‘గేమ్ చేంజర్’ ప్రయాణంలో మీకు సవాలుగా అనిపించిన అంశం ఏంటి?

గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ)

‘గేమ్ చేంజర్’లో ఉండే ప్రత్యేకతలు ఏంటి?

గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది. థియేటర్లో ఈ సాంగ్ బ్లాస్ట్ అవుతుంది. ఓ కాఫీ కప్పులోనే ఊరి సెట్ వేసినట్టుగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.

మీరు మళ్లీ దర్శకత్వం వహిస్తారా? అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా?

నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారెలానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది జరుగుతుందేమో చూడాలి.

దిల్ రాజు గురించి, ఆయన ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పండి?

దిల్ రాజు నిజంగా ఆల్ రౌండర్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లని నిర్మాత అని చెప్పలేం. దిల్ రాజు గారు సెట్‌కు వస్తారు. అన్ని క్రాఫ్ట్‌లను పరిశీలిస్తారు. సెట్స్ మీదే సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. అందుకే దిల్ రాజు గారు ఆల్ రౌండర్ అన్నాను. ఆయన ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టారు. ఒక్క జరగండి పాటకే కొన్ని కోట్లు పెట్టారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో థియేటర్లో మీకే తెలుస్తుంది.

Ram Chran Lady Fan Mind Blowing Words About Game Changer Movie || Kiara Advani || Telugu Rajyam