Sathyam Sundaram Movie: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం‘. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ సినిమా విశేషాలని పంచుకున్నారు.
96 తర్వాత మీ నుంచి వస్తున్న సినిమా ‘సత్యం సుందరం’. కథ పరంగా ఎలాంటి వైవిధ్యం వుంటుంది?
-96 లవ్ స్టొరీ. సత్యం సుందరం ఫ్యామిలీ డ్రామా. కార్తీ, అరవింద్ స్వామి క్యారెక్టర్స్ మధ్య ఒక నైట్ లో జరిగే కథ. వాళ్ళ మధ్య అనుబంధం ఏమిటి? ఆ ఒక్క నైట్ లో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగిందనేది హోల్ స్టొరీ.
ఈ కథని ముందుగా నవలగా రాసిన తర్వాత స్క్రీన్ ప్లే చేశారని విన్నాం? అది స్క్రీన్ పైకి తీరుకురావడంలో ఎంతవరకూ సక్సెస్ సాధించారని బావిస్తున్నారు?
-ఒక ఆర్ట్ ని చేయడంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి అలోచించను. ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్ దటాల్స్. వర్క్ చేస్తున్నప్పుడు మనకి హ్యాపీనెస్ ని ఇచ్చిందా? ఆసక్తిని కలిగించిందా? ఆర్టిస్టిలు ఎక్సయిటెడ్ గా వున్నారా లేదా అనేదే చూస్తాను. నేను తృప్తిగా వుంటేనే సినిమాని తీయగలను. కార్తీ, అరవింద్ స్వామి లాంటి మంచి యాక్టర్స్ ని కన్వెన్స్ చేయగలను. నేను సాటిస్ఫై కాకపొతే మిగతా వారిని సాటిస్ఫై చేయలేను. రైటింగ్, సినిమా విషయంలో చాలా హ్యాపీగా వున్నాను.
Sathyam Sundaram: తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో కార్తీ చిత్రం
–కార్తీ, అరవింద్ స్వామి ముందు నవలని చదివారు. దాన్ని స్క్రిప్ట్ గా మలచడం వెరీ ఈజీ. నవల కూడా సినిమా స్క్రిప్ట్ స్ట్రక్చర్ లోనే రాశాను.
ఈ కథకి కార్తీ, అరవింద్ స్వామీ మీ ప్రైమరీ ఛాయిస్ నా ?
-కార్తీ, అరవింద్ స్వామీ ఇద్దరిలో ఎవరు అంగీకరీంచకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. ఇలా ఎందుకు చెబుతున్నానో సినిమా చూసినప్పుడు మీకు అర్ధమౌతుంది. వాళ్ళిద్దరే ఆ పెర్ఫార్మెన్స్ చేయగలరు. వాళ్ళ కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్.
ప్రొడ్యూసర్ గా సూర్య గారి నుంచి ఎలాంటి సపోర్ట్ వుంది ?
-సూర్య గారికి సినిమా అంటే చాలా పాషన్. మంచి సినిమాలు చేయాలనే తపనతో వుంటారు. ఈ కథ ఆయనకి చాలా నచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు.
సత్యం సుందరం మ్యూజిక్ గురించి ?
-96 సినిమాకి పని చేసే మ్యూజిక్ డైరెక్టర్, కెమరామ్యాన్, ఎడిటర్ ఈ సినిమాకీ పని చేశారు. మేమంతా ఫ్రెండ్స్. ఇది నాకు బిగ్ స్ట్రెంత్.
-గోవింద వసంత 96 కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. సత్యం సుందరం సినిమాకి కూడా అంతే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా మ్యూజికల్ ట్రీట్ లా వుంటుంది.
-టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా వుంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ స్టొరీ చాలా అద్భుతంగా సపోర్ట్ చేసేలా వుంటాయి.
Sathyam Sundaram: ‘ఊపిరి’ తర్వాత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ సత్యం సుందరం: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి
‘సత్యం సుందరం‘ తెలుగు ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుంటుంది ?
-తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూసిన ఫ్రెండ్స్ చాలా బావుందని చెప్పారు.
-‘సత్యం సుందరం‘ మంచి ఫ్యామిలీ డ్రామా. తెలుగు ఆడియన్స్ ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ గా వుంటారు. ఈ జోనర్ ని చాలా ఇష్టపడతారు. ‘సత్యం సుందరం’ తెలుగులో హోం గ్రౌండ్ లా వుంటుంది.